లక్ష దాటిన కంటి వెలుగు


Tue,September 18, 2018 12:36 AM

-జిల్లాలో 1,12,078 కంటి పరీక్షలు
-27,796 మందికి అద్దాల పంపిణీ
-ఒక్క రోజులో 6,560 పరీక్షలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. సోమవారం సాయంత్రం వరకు జిల్లాలో మొత్తం 1,12,078మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 36బృందాలుగా 432మంది వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి రోజు వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలతో పాటు అవసరమున్నవారికి సర్జరీలు చేయాలని గుర్తించి వారిని హైదరాబాద్‌లోని సరోజినీ కంటి దవఖానకు రెఫర్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులకు వైద్యులు ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్లు చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజు 6,087మందికి పరీక్షలు నిర్వహించి 1,660మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. 1,502మందికి అద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 627మందికి ఆపరేషన్ల కోసం గుర్తించి సిఫార్సులు పంపించారు. కాగా సంగారెడ్డి శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ఆప్తోమెట్రిస్టు స్పెషలిస్టు డాక్టర్ సుధాకర్ 207మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 15మందికి అద్దాలు పంపిణీ చేశారు. 63మందికి అద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 5మందికి సర్జరీలు చేసేందుకు రెఫర్ చేశారు. అలాగే ఇందిరా కాలనీలోని ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన కంటి వెలుగులో 121మందికి కంటి పరీక్షలు నిర్వహించి 39మందికి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే 48మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు చేశారు. 7 మందికి ఆపరేషన్ల చేసేందుకు రెఫర్ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రశాంతంగా కంటి పరీక్షలు కొనసాగుతుండగా సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...