ప్రచార హోరు.. గులాబీ జోరు..


Wed,September 12, 2018 11:59 PM

-గడప గడపకూ ప్రగతి నివేదన
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు నీరాజనం
-గ్రామాల్లో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు
- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్బైక్ ర్యాలీలు.. పాదయాత్రలు.. గులాబీ జెండావిష్కరణలు.. ఇంటింటికీ వెళ్లి ప్రగతి నివేదనలు.. ఇతర పార్టీల నుంచి చేరికలు.. ఏకగ్రీవ తీర్మానాలతో టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించని పరిస్థితుల్లో ఉంటే.. టీఆర్‌ఎస్ మాత్రం ప్రజల మద్దతుతో జోరుగా ముందుకు సాగుతున్నది. బుధవారం మెదక్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, అందోల్‌లో క్రాంతి కిరణ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. దుబ్బాకలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ సంగమేశ్వరాలయంలో భూపాల్‌రెడ్డి పూజలు చేశారు. బెజ్జంకి క్రాస్‌రోడ్డు వద్ద గ్రామస్తులు టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఆశీర్వదించండి..అండగా ఉంటా..
అందోల్, నమస్తే తెలంగాణ : అహంకారానికి... ఆత్మగౌరవానికి మధ్య పోరాటాం.. ఓ సాధారణ జర్నలిస్టుని.. ఉమ్మడి రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిపై పోరు.. ఆశీర్వదించండి.. అండగా ఉంటా.. అని టీఆర్‌ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అందోల్ నియోజకవర్గ ప్రజలను కోరారు. బుధవారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. అందోల్‌లో పార్టీ కార్యాలయాన్ని క్రాంతి కిరణ్ ప్రారంభించారు. అనంతరం హౌజింగ్ బోర్డు నుంచి బైకుపై ర్యాలీగా బయలుదేరి, బస్వవేశ్వర విగ్రహానికి, క్లాక్ టవర్‌లోని గాంధీజీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ర్యాలీలో కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాల్లి, జై స్థానికం...జై జై స్థానికం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఏంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు డీబీ నాగభూషణం, కమ్రొద్దీన్, యేసయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, జగన్మోహన్‌రెడ్డి, మండల కో ఆర్డినేటర్ వర్కల అశోక్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, జోగిపేట పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి, టేక్మాల్, వట్‌పల్లి, రేగోడు, అల్లాదుర్గం పార్టీ మండలాల అధ్యక్షులు లక్ష్మీకాంత్‌రెడ్డి, గోవర్ధన్, విఠల్, అల్లం నవాజ్‌రెడ్డి, యూసూఫ్, వీరారెడ్డి, వినోద్, సుభాశ్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె శ్రీకాంత్, పులుగు గోపాల్‌రావు, పిట్ల లక్ష్మణ్, గాజుల నవీన్‌కుమార్, సీనియర్ నాయకులు రమేశప్ప, సాయికుమార్, మల్లికార్జున్ పాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, కాశీనాథ్, నర్సింహారెడ్డి, వీరప్ప, ప్రభాకర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, అశోక్, బస్వరాజ్, ఖాజాపాష, నరేందర్‌గౌడ్, సురేందర్‌గౌడ్, సుధాకర్, అల్లె గోపాల్, గోరే, అశోక్, శంకర్‌యాదవ్, మహేశ్‌యాదవ్, అనిల్‌రాజ్, రవీందర్‌గౌడ్, జాగృతి నాయకులు ఎండీ ఫైజల్, నాగరాజు, మారుతి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మహిపాలుడికే మద్దతు..
పటాన్‌చెరుటౌన్ : టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డికే మద్దతు ఇస్తామంటూ టీఆర్‌ఎస్ పట్టణ విభాగంతోపాటు, పలు మహిళా సంఘాలు ప్రతినబూనాయి. బుధవారం పటాన్‌చెరులోని ముదిరాజ్ భవనంలో, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బాయికాడి విజయకుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్, నర్ర భిక్షపతి మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రూ.4,300 కోట్ల నిధులతో అభివృద్ధి పరిచిన మహిపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఈ సమావేశంలో షకీల్ లడ్డూ, ఇమ్రాన్, వంగరి అశోక్, తులసీదాస్, శ్రీనివాస్ రెడ్డి, నాగసాని సత్తయ్య, వినోద్‌రెడ్డి, జయశ్రీ, గుండమోళ్ల రాజు, హాషం, కొండల్, విద్యాసాగర్, వెంకటేశ్, సందీప్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

మద్దతు పలికిన మహిళలు...
అమీన్‌పూర్ మండలంలోని ఎన్‌ఆర్‌ఐ కాలనీ మహిళలు బుధవారం గూడెం మహిపాల్‌రెడ్డి స్వగృహంలో ఆయన సతీమణి యాదమ్మను స్రవంతి, భవాని, తులసీ, శిరీష, విశాలాక్షి, ప్రసన్న, శ్రీపద్మ, సాయిప్రసన్న తదితరులు కలిసి తమ మద్దతును ప్రకటించారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...