వెల్దుర్తిలో ప్రచార ప్రభంజనం


Wed,September 12, 2018 11:58 PM

వెల్దుర్తి : నర్సాపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మదన్‌రెడ్డి బుధవారం మండలంలోని రామంతాపూర్‌లో ప్రచారం ప్రారంభించారు. ఉదయం మాసాయిపేట రుక్మిణీపాండురంగస్వామి, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రామంతాపూర్‌లోని మజీద్‌లో ప్రార్థనలు చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జాతీయ రహదారి మీదుగా రామంతాపూర్, లింగారెడ్డిపల్లి, రామంతాపూర్ గిరిజన తండాల మీదుగా భారీ బైక్ ర్యాలీ తీశారు. ప్రచారానికి మదన్‌రెడ్డి వెంబడి వచ్చిన నాయకుల వాహనాల కాన్వాయ్ విశేషంగా ఆకట్టుకున్నది. మాసాయిపేట వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించిన మదన్‌రెడ్డి రామంతాపూర్ వరకు బైక్‌పై రావడంతో యువకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. పటాకులు కాల్చుతూ డప్పుచప్పుళ్లతో మదన్‌రెడ్డికి రామంతాపూర్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి, చౌరస్తాలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ ర్యాలీగా లింగారెడ్డిపల్లికి చేరుకుని గడపగడపకు తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రారంభం రోజు ప్రచారం ప్రభంజనంలా సాగింది.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...