లక్షకు చేరువలో... కంటి వెలుగు


Wed,September 12, 2018 11:57 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష పరీక్షలకు చేరేందుకు చేరువలో ఉన్నది. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. 15వ తేదీ నుంచి జిల్లా లో కంటి వెలుగు పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం వరకు జిల్లాలో మొత్తం 99,251 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 36 బృందాలుగా 432 మంది వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. వైద్య బృందాలు ఏర్పాటు చేసిన శిభిరాలకు కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రతి రోజు వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలతో పాటు అవసరమున్నవారికి సర్జరీలు చేయాలని గుర్తించి వా రిని హైదరాబాద్‌లోని సరోజినీ కంటి దవఖానకు రెఫర్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాలుగా కంటి సమస్యలతో బాధపడుతు న్న బాధితులకు వైద్యులు ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్లు చేస్తున్నారు. బుధవారం ఒ క్కరోజు 5,849 మందికి పరీక్షలు నిర్వహించి 1,290 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశా రు. 999 మందికి కండ్లద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 441 మందికి ఆపరేషన్ల కోసం గుర్తించి సిఫార్సులు పంపించా రు. కాగా సంగారెడ్డి శాంతినగర్‌లోని సె యింట్ ఆంథోనీస్ పాఠశాల ఆవరణలో ఏ ర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం లో ఆప్తోమెట్రిస్టు స్పెషలిస్టు డాక్టర్ సుధాకర్ 254 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 43 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 45 మందికి కండ్లద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 7 మందికి ఆపరేషన్లు చేసేందుకు రెఫర్ చేశారు. అలాగే ఇందిరా కాలనీలోని ప్రై మరీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో 138 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 62 మందికి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే 37 మందికి కండ్లద్దాల కోసం ఆర్డర్లు చేశారు. 6 మందికి ఆపరేషన్‌లు చేసేందుకు రెఫర్ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రశాంతంగా కంటి పరీక్షలు కొనసాగుతుండగా సీఎం కేసీఆర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...