జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Wed,September 12, 2018 11:57 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరి నియమించినా విజయం కోసం పని చేస్తామని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ తెలిపారు. బుధవారం జహీరాబాద్ సమీపంలోని హోతి(కే) శివారులో నిర్మాణం చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అభ్యర్థి విజయనికి కృషి చేస్తాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధ్ది తెలంగాణలో జరిగిందన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. అన్ని వర్గల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేశారన్నారు. జహీరాబాద్ చరిత్రలో ఎన్నడు లేని అభివృద్ధ్ది మంత్రి హరీశ్‌రావు సహకరంతో జరుగుతుందన్నారు. న్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పథకాలు విజయనికి కృషి చేస్తాయన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన టీఆర్‌ఎస్ వైపు ప్రజలు ఉన్నారని వివరించారు. జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించేందుకు మండల మండల నాయకుల అభిప్రాయలు తీసుకోని ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు, సినీ నిర్మాత మాల్కాపూరం శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్‌రెడ్డి. వైజానాథ్, ఎండీ. యాకూబ్‌తో పాటు పలువురు ఉన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...