కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి


Tue,September 11, 2018 11:27 PM

రాయికోడ్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాయికోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారిణి సర్ఫరాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఖామ్‌జమల్‌పూర్‌లో కంటి వెలుగు వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్సలను చేపట్టి, మందులు, కండ్లద్దాలను అందజేశారు. గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిబిరంలో 222 మంది వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో రషీద్, కంటి వెలుగు సిబ్బంది చంద్రలీల, సుశీల, లక్ష్మి, బాబు, యాదవరావ్, రఘు ఉన్నారు.

చౌటకూర్‌లో..
పుల్కల్: మండల పరిధిలోని చౌటకూర్‌లో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించారు. 152 మందికి పరీక్షలు నిర్వహించగా 36 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 6 మందికి కంటి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారని కమ్యూనిటీ హెల్త్ అధికారి ఉషారాణి తెలిపారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...