ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలి


Tue,September 11, 2018 11:27 PM

అందోల్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు అందోలు-జోగిపేట మున్సిపల్ పరిధిలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు నమోదు ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నారు. మంగళవారం జోగిపేటలోని రిక్షా కాలనీలో మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం పర్యటించారు. కాలనీలోని ఇంటింటికీ తిరుగుతూ ఓటుకు సంబంధించిన వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. గతంలో ఓటు హక్కును కలిగి ఉండి, ప్రస్తుతం ఓటరు జాబితా పేర్లు లేకపోతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గాజుల అనిల్‌కుమార్, విఠల్, ఎండీ ఫైజల్, నాగరాజు ఉన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...