రూ. 2లక్షల ఎల్‌వోసీ అందజేత


Tue,September 11, 2018 11:27 PM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ఎండీ. అబ్దుల్ తన్వీర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడు తూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండడంతో ఈ విషయాన్ని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తన్వీర్ వైద్య చికిత్సల నిమిత్తం ముందస్తుగా రూ. 2లక్షలను మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించి ఎల్‌వోసీ పత్రాన్ని మంగళవారం తన్వీర్ కుటుంబ సభ్యులకు అందజేశా రు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ అనేక నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా సీఎం సహయనిధి ద్వారా నారాయణఖేడ్‌కు చెందిన మాధవరావుకు రూ. 60వేలు, నాగలగిద్ద మండలం వల్లూరుకు చెందిన మహ్మద్ అజ్మత్‌కు రూ. 20వేలు, గోందేగావ్ గ్రామానికి చెందిన నిర్మలకు రూ. 34వేల చెక్కులను అందజేశారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...