సాఫీగా నల్లవాగు ఆయకట్టుకు సాగు నీళ్లు


Tue,September 11, 2018 11:27 PM

సిర్గాపూర్ : వానకాలం వరి పంటల సాగుకు నల్లవాగు ఆయకట్టు కింద సాఫీగా సాగు నీళ్లు అందిస్తున్నామని ఐబీ డీఈఈ జలంధర్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా 60క్యూసెక్కులు, ఎడమ పంట కాల్వ ద్వారా 10క్యూసెక్కుల నీటిని పంటలకు వదులుతున్నామని తెలిపారు. వర్షాలు లేనందున ప్రాజెక్టులోకి ఆశించినంతా వరద నీరు చేరలేదని చెప్పారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని రైతుల ఆయకట్టు సాగుకు వదులుతున్నట్లు తెలిపారు. ఎగువ నుంచి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో లేనందున రైతులు సాగు నీళ్లను వృథా చేయకుండా, చివరి ఆయకట్టు వరకు పారేలా సహకరించాలన్నారు. ప్రాజెక్టులో మొత్తం 746ఎంసీఎఫ్‌టీ స్టోరేజీ కాగా ప్రస్తుతం 230ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వకుగాను దీంట్లో 100ఎంసీఎఫ్‌టీ డెడ్‌స్టోరేజీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు నీటి వృథా చేయరాదని ఆయన కోరారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...