భూపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం


Tue,September 11, 2018 11:27 PM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : నారాయణఖేడ్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నారాయణఖేడ్ రజకసంఘం బాధ్యులు భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూపాల్‌రెడ్డి భూమి పూజ చేసిన సందర్భంగా రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, టీఆర్‌ఎస్ నాయకులు విజయ్‌బుజ్జిల ఆధ్వర్యంలో భూపాల్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సత్కరించారు. భూపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని, అయితే భారీ మెజార్టీతో గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. భూపాల్‌రెడ్డికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రజకుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా చితికిపోయిన తమకు అండగా నిలిచిందన్నారు. మరోమారు కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకుంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...