ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు


Tue,September 11, 2018 11:27 PM

సంగారెడ్డి టౌన్ : మహిళలను విదేశాలకు తరలించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు కావడం వల్ల సంగారెడ్డికి పట్టిన శని వదిలిందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శంకర్‌గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ ప్రభుగౌడ్‌లు అన్నారు. సోమవారం శంకర్‌గౌడ్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎమ్మెల్యే గా గెలిచే నాటికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అక్రమ దందాలకు పాల్పడి కోట్ల డబ్బులను కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో కార్యకర్తల నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని ఎమ్మె ల్యే పదవి పోయినంక కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. జగ్గారెడ్డిని నమ్ముకున్న కార్యకర్తలకు ఎవ్వరికి కూడా ఎలాంటి సహాయం చేయలేదన్నారు. గౌడ సొసైటీ నుంచి దౌర్జన్యంగా లక్షల రూపాయలు వసూలు చేశాడని ఇవ్వకుంటే తీవ్ర ఇబ్బందుల పా లు చేశాడని విమర్శించారు. తప్పుడు పాస్ పోర్టుతో విదేశాలకు మహిళలను తరలించడం వల్లే పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేశారన్నారు. జగ్గారెడ్డి అరెస్టుకు టీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. జగ్గారెడ్డిని అరెస్టు చేయడం వల్ల సంగారెడ్డి ప్రజలు నరకాసురుడి పీడ విరగడైందని సంతోషంగా ఉన్నారన్నారు. ఆయన అరెస్టు వల్ల ఎవరికి ఎలాంటి బాధ లేదన్నారు. పోలీసులు తమ పని తాము చేశారని చట్టం ఎవ్వరికి చుట్టం కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మసూద్ అబ్బుల్లా, టీఆర్‌ఎస్ నాయకుడు చిన్నా తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...