నాణ్యమైన గొర్రెలను పంపిణీ చేయాలి


Tue,September 11, 2018 11:26 PM

సంగారెడ్డి చౌరస్తా : రెండో విడుత పంపిణీలో భాగంగా వ్యాధి రహిత, నాణ్యమైన గొర్రెలను పంపిణీ చేయాలని ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్ బాపుమల్‌శెట్టి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం వెటర్నరీ పాలి క్లినిక్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మల్‌శెట్టి మాట్లాడుతూ మొదటి విడుత లిస్ట్ ఏలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 42,517యూనిట్లకు గాను 37,714యూనిట్లను పంపిణీ చేశామన్నారు. రెండో విడుత లిస్ట్ బీ లో 41,726యూనిట్లు లబ్ధిదారులకు అందాల్సి ఉన్నదని స్పష్టం చేశారు. అయితే రెండో విడుతలో అందించే గొర్రెలు నాణ్యంగా ఉండాలని సూచించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పశు వైద్యులను కోరా రు. పథకం కింద అందజేసిన గొర్రెలలో ఇప్పటి వరకు చనిపోయిన వాటికి సంబంధించిన బీమాను చెల్లించడంలో పశువైద్య అధికారులు చొరవ చూపాలన్నారు. రైతుల గడప వద్ద వైద్యం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 1962అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సహకార సంఘం డైరెక్టర్లు ఈశ్వరయ్య, భూమయ్య, వెంకటేశం, నరేశ్, మల్లేశ్‌యాదవ్, ఎండీ డాక్టర్ బి నరేశ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...