జిల్లాలో 93,402 మందికి కంటి పరీక్షలు


Tue,September 11, 2018 11:26 PM

-ఒక్క రోజులో 5,672 మందికి పరీక్షలు
-మొత్తం 23,372 మందికిఅద్దాల పంపిణీ
-జిల్లాలో 36 గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు
సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మంగళవారం సాయం త్రం వరకు జిల్లాలో మొత్తం 93,402మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 36బృందాలుగా 432మంది వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. వైద్య బృందాలు ఏర్పాటు చేసిన శిబిరాలకు కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రతిరోజు వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలతో పాటు అవసరమున్నవారికి సర్జరీలు చేయాలని గుర్తించి వారిని హైదరాబాద్‌లోని సరోజినీ కంటి దవఖానకు రెఫర్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులకు వైద్యులు ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్లు చేస్తున్నారు.

మంగళవారం ఒక్కరోజు 5,672మందికి పరీక్షలు నిర్వహించి 1,428 మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. 1,199 మందికి అద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 430మందికి ఆపరేషన్ల కోసం గుర్తించి సిఫార్సులు పంపించారు. కాగా సంగారెడ్డి శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు 230మందికి పరీక్షలు నిర్వహించగా 47మందికి అద్దాలు పంపిణీ చేశారు. 48మందికి అద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశా రు. ఇద్దరికి ఆపరేషన్లు చేసేందుకు రెఫర్ చేశారు. అలాగే ఇందిరా కాలనీలోని ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన కంటి వెలుగులో 152 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 51మందికి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే 47మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు చేశారు. 10మందికి ఆపరేషన్లు చేసేందుకు రెఫర్ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రశాంతంగా కంటి పరీక్షలు కొనసాగుతుండగా ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

కొండాపూర్‌లో..
కొండాపూర్ : కంటి వెలుగుతో చీకటి దూరమై, ఇంటికి వెలుగు అవుతుందని మండల వైద్యాధికారి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కొండాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం పేదల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిందన్నారు. ఆరు నెలల పాటు ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తామన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ నుంచి ఈ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని సూచించారు. కార్యక్రమం లో వైద్య సిబ్బంది అంజప్ప, విజయ్‌కుమార్, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మెంబర్ నాగయ్య, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు గౌసొద్దీన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...