18 ఏండ్లు దాటిన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చాలి


Tue,September 11, 2018 11:26 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలో 18 ఏండ్లు దాటిన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చాలని కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. ఈఆర్‌వోలు, ఏఆర్వోలతో మంగళవారం తన చాంబర్‌లో కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2018 జనవరి నాటికి 18 ఏళ్లు నిండినవారిని ఓటరు జాబితాలో చేర్చాలన్నారు. జిల్లాలోని డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, మెడికల్ తదితర అన్ని కళాశాలలో చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థుల నుంచి ఓటరు జాబితాలో నమోదుకు ఫారం-6 దరఖాస్తు తీసుకుని జాబితాలో నమోదు చేయాలని సూచించారు. ని ఈఆర్‌వోలు, ఏఆర్వోలు ఎన్నికలపై పూర్తి దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గం వారీగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా అద్దంలా ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలన్నారు. సరైన ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించాలని తెలిపారు. ఉద్యోగుల పూర్తి వివరాలను డీటీవో నుంచి తీసుకోవాలని, కేజీబీవీ, విద్యావాలంటర్లు, సీఆర్పీ, తదితర ఉద్యోగుల నిర్దేశిత వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారి విజయలక్ష్మీని ఆదేశించారు. నోడల్ అధికారుల నియమానికి, మాస్టర్ ట్రైనర్స్‌ను గుర్తించడం, ఎన్నికల నిర్వహణకు అవ్సరమైన శిక్షణ శెడ్యూలు తదితర ప్రక్రియలపై కసరత్తు చేయాలని డీఆర్‌వోకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవేన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...