చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి


Tue,September 11, 2018 12:03 AM

అందోల్, నమస్తే తెలంగాణ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహర్నిశలు కృషి చేసిన ఉద్యమ నాయకురా లు చాకలి ఐలమ్మ 33వ వర్థంతిని జోగిపేటలో నిర్వహించారు. సోమవారం జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ. నాగభూషణం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. చాకలి ఐలమ్మ అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గాజుల అనిల్‌కుమార్, ఎండీ. ఫైజ ల్, రవి, సంతోశ్, చందు, నాగరాజు, ఇమ్రాన్, శివ, జుబేర్, అమీర్, లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హత్నూరలో..
హత్నూర : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్నగారిలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆమె చేసిన సేవలను గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, ఆంజనేయులు, బంటుశ్రీనివాస్, మన్నె వెంకటేశం, కొలన్వ్రి, వంజరిరమేశ్, చంద్రయ్య, రాజుగౌడ్, సుధాకర్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

మునిపల్లిలో..
మునిపల్లి : చాకలి ఐలమ్మ వర్ధంతిని మునిపల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సబ్‌ప్లాన్ జిల్లా కార్యదర్శి రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి చాకలి ఐలమ్మ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రజకసంఘం మండల అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు శ్రీకాంత్, శివకుమార్, శ్రీశైలం, రాములు, బాలయ్య, చంద్రయ్య, నాగన్నబాబు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్ : తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక కృషి చేసిన వ్యక్తుల్లో చాకలి ఐలమ్మ ఒక్కరు అని మండల రజక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
సోమవారం రాయికోడ్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. త్వరలో రాయికోడ్‌లో చాకలి ఐలమ్మ విగ్రాహం ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అంబాదాస్, సిద్ధన్న, రాములు, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లి : తెలంగాణ ఉద్యమకారిణీ చాకాలి ఐలమ్మ స్ఫూర్తితో రజకులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పలువురు రజకసంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం వట్‌పల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చూపిన పోరాట పటిమతో రజకులందరూ ఏకతాటిపై ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

పుల్కల్‌లో..
పుల్కల్ : మండల కేంద్రంలో రజకసంఘం ఆధ్వర్యం లో సోమవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని జరుపుకున్నారు. రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి మద్దికుంట కొండయ్య, మండల రజక సంఘం అధ్యక్షుడు నర్సింహులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...