షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశాలు


Sun,September 9, 2018 11:06 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: కలెక్టర్ హన్మరావు ఎఫెక్ట్ ప్రారంభమైంది. పటాన్‌చెరు నియోజకవర్గం బూత్ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్‌లు కూడా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం పటాన్‌చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని గాయత్రి పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ హన్మంతరావు మాట్లాడారు. ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వహించాలని బూత్ లెవల్ అధికారులను సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. బూత్ లెవల్ మీటింగ్‌లకు తప్పనిసరిగా రావాల్సి ఉండగా కొందరు గైర్హాజరు అయ్యారని వారికి షోకాజ్‌నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. 24గంటల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఎన్నికల విధుల్లో పండుగలు, సెలవులు ఉండవని గుర్తించాలన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్‌లకు 20 పేజీల పుస్తకమే వేదవాక్కు అన్నారు. ఓటరు లిస్టులలోని తప్పులను సరిదిద్దడం చేయాలన్నారు. వీవీఐపీలు ఉంటే వారి లిస్టును పరిశీలించాలన్నారు. డూప్లికెట్ ఓటర్లు ఉంటే వారిని గుర్తించి తీసేయాలన్నారు. ఫొటోలు వారివేనా మారినవా చూడాలన్నారు. ఏ పార్టీకి, నాయకుడికి అనుకూలంగా పనిచేయరదని కలెక్టర్ హితవు పలికారు. కుటుంబ సభ్యులు ఎవరైన నేతకు సన్నిహితంగా ఉంటారని భావిస్తే వారిని కూడా మీపనిలో సాయంకోసం అడుగరాదన్నారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తేనే క్షేమకరం అన్నారు. పోలింగ్ స్టేషన్‌లను తహసీల్దార్‌లు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. తాగునీరు, కరెంట్, రాంప్ తదితర సౌకర్యాలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో టీ శ్రీను, నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి విక్రమ్‌రెడ్డి, తహసీల్దార్లు గిరి, గోపాల్, శివకుమార్, శ్రీశైలం, స్వామి తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...