అర్హుల పేర్లు ఓటరు లిస్టులో నమోదు చేయాలి


Sun,September 9, 2018 11:06 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు లిస్టులో నమోదు చేసేందుకు బూత్ స్థాయి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ హన్మంతరావు తెలిపారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని జేజే ఫంక్షన్ హాల్లో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల నిర్వహణ పై అవగాహన కల్పించారు. ప్రతి బూత్‌లో అర్హులైన వారి పేర్లను ఓటరు లిస్టులో నమోదు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి కొత్త పేర్లు నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు. గ్రామంలో ఉండని వారి పేర్లు తొలగించారాదన్నారు. కొందరు ఉపాధి కోసం పట్టణాలకు వలసలు పోవడం, తిరిగి గ్రామానికి వచ్చి ఓటు వేస్తారన్నారు. వ్యవసాయ భూమి, ఇల్లు ఉన్నా వారి పేర్లు తొలగించొద్దన్నారు. మరణించిన వారి వివరాలు సేకరించి, ఇంటి యజమాని నుంచి సంతకం తీసుకుని ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. కొందరు పెళ్లి చేసుకుని ఊరు నుంచి వెళిలపోతే ఆధార్ అనుసంధానంతో వారి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఈ నెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి కొత్త పేర్లు తీసుకోవాలన్నారు. తొలగించే పేర్లు విచారణ చేసి తొలగించలన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఆర్‌డీవో అబ్దుల్ హమీద్, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్ తహసీల్దార్లు దశరథ్, రాధాబాయి, దశరథ్‌సింగ్, రెవెన్యూ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...