గృహిణిపై ఆర్‌ఎంపీ అత్యాచార యత్నం


Sun,September 9, 2018 11:05 PM

హత్నూర: వివాహిత పై ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ సంఘటన మండలకేంద్రం హత్నూరలో జరిగింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం మండలంలోని పన్యాలకు చెందిన దంపతుల కుమారుడికి జ్వరం రావడంతో శనివారం రాత్రి హత్నూరలోని ప్రైవేటు ఆర్‌ఎంపీ శ్రీశైలం వద్దకు చికిత్స నిమిత్తం వచ్చారు. జ్వరం వచ్చిన బాలుడికి వైద్యం చేయడం పక్కన పెట్టి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేయబోయాడు. అంతలోనే ఆ మహిళ కేకలు వేసింది. దవాఖాన బయట ఉన్నవారు లోపలికి రావడంతో ఆర్‌ఎంపీ శ్రీశైలం అక్కడ నుంచి వెల్లిపోయాడు. విషయాన్ని బాధితురాలు కుటుంబీకులకు చెప్పింది. అదేరాత్రి హత్నూర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఆదివారం బాధిత కుటుంబీకులు, పన్యాల గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దవాఖాన, పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అత్యాచారానికి యత్నించిన డాక్టర్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ జోక్యం చేసుకొని ఆర్‌ఎంపీ డాక్టర్ శ్రీశైలంపై కేసునమోదు చేశామని తెలిపారు. అయినా ఆందోళన విరమించలేదు. జిన్నారం సీఐ రవి, ఎస్‌ఐ శ్రీనివాస్, గుమ్మడిదల ఎస్‌ఐ ప్రశాంత్ హత్నూరకు చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ఇదిలా ఉండగా ఆర్‌ఎంపీ శ్రీశైలంపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని స్థానికులు తెలిపారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...