భక్తులతో సందడిగా ఆలయాలు


Sun,September 9, 2018 11:05 PM

న్యాల్‌కల్ : మండల పరిధిలోని పలు గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో సందడి నెలకొంది. ఆ దివారంతో శ్రావణ మాసం ముగింపు, అ మావాస్య కావడంతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల కు చెందిన భక్తులు భా రీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రేజింతల్ సిద్ధి వినాయక ఆలయం, ముంగి ఆదిలక్ష్మీ ఆలయం, హద్నూర్‌లోని వరసిద్ధి వినాయక ఆలయం, రాఘవపూర్‌లోని పంచవటి క్షేత్రం, మల్గిలోని నవనాథ్ సిద్ధలింగేశ్వర ఆలయాలలో భక్తులు కుంకుమార్చన, రుద్రాభిషేకం, అభిషేకం, తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అయా ఆలయాలల్లో నిర్వహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా ఆలయాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కోహీర్ : మండలంలోని బడంపేట రాచన్నస్వా మి దేవాలయం, కవేలి మహాలింగ సంగమేశ్వరాలయంలో శ్రావణ మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆదివారం నాటికి శ్రావణం ముగింపు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం గర్భగుడిలోని శివలింగానికి అభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, మహామంగళమారతి చేపట్టారు. కార్యక్రమంలో ఈవో శివరుద్రప్ప, జగదీశ్వర్‌స్వామి, శివానంద్, శివమూర్తిస్వామి, పలు ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...