సాంకేతికతను అందిపుచ్చుకోవాలి


Sun,September 9, 2018 11:05 PM

పుల్కల్: విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని జేఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రొఫెసర్ కామాక్ష్మి ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. సూల్తాన్‌పూర్ జేఎన్టీయూలో రెండు రోజులు పాటు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రబోధన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న రంగంలో పట్టు సాధించడమే కాకుండా వివిధ కోర్సులపై దృష్టి కేంద్రీకరించాలని సూచించాడు. అన్ని రంగాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు రాణించాలన్నారు. బయోటెక్నాలజీ గురించి మాట్లాడుతూ డిజిటల్ రంగానికి సంబంధించి కంప్యూటర్ సైన్స్, ట్రాన్సిస్టర్, అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి వివరించారు. ఇలా ప్రతి కోర్సులో లేటెస్ట్ టెక్నాలజీపై వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సాప్ట్ స్కిల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నరేందర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నేరెళ్ల ప్రవీణ్ రెడ్డి, అరవింద్, శ్రీనివాస్, కపిల్, అఖిల్, యాదగిరి, శ్రీరామ్, హర్షిణి, విద్య పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...