తెలంగాణ ఉద్యమ ఊపిరి కాళోజీ


Sun,September 9, 2018 11:04 PM

అందోల్, నమస్తేతెలంగాణ: కాళోజీ జయంతి వేడుకలను ఆదివారం ఎంపీపీ కార్యాలయంలో అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కాళోజీ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వట్‌పల్లిలో..
వట్‌పల్లి: ప్రజాకవి కాళోజీ 104వ జయంతి వేడుకలను ఆదివారం వట్‌పల్లి ఏఎంసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ ఎన్నో ప్రజా ఉద్యమల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తన కవితల ద్వారా ప్రపంచానికి చాట్టి చెప్పి, అణగారిన వర్గాలను తన కవితల ద్వారా జాగృతం చేసిన మహాయోధుడని కొనియడారు.
హత్నూరలో..
హత్నూర: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను హత్నూర మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆయాపార్టీల నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. హత్నూర తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జయరాం కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కాళోజీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. సిరిపురలో ఎంపీటీసీ నరేందర్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమాల్లో వీఆర్‌వోలు సిద్ధిరాంరెడ్డి, నర్సింహులు, సిరిపుర మాజీ సర్పంచ్ మాణిక్యరెడ్డి, వసతిగృహ అధికారి బద్రీప్రసాద్, సీడీసీ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...