రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి


Sun,September 9, 2018 11:04 PM

పటాన్‌చెరుటౌన్ : బంధువుల ఇంటికి బయలుదేరిన ఒరిస్సా కార్మికుడి కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కభళించింది. ప్రమాదంలో భర్త చిన్నారి బిడ్డను పొగొట్టుకున్న మహిళ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతుంది. పోలీసుల వివరాల ప్రకారం ఒరి స్సా రాష్ర్టానికి చెందిన రమేశ్ చంద్రదాస్ (36) కొన్ని సంవత్సరాలుగా భార్య సబితాదాస్, కొడుకు సరోజ్‌దాస్ అలియాస్ బబ్లూ(5)లతో కలిసి ముత్తంగి గ్రామంలోని డీఎన్ కాలనీలో నివసిస్తున్నాడు. పాశమైలారంలో ఓ ప్రైవేటు పరిశ్రమలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో భార్య కొడుకుతో కలిసి జీడిమెట్లలోని బంధువుల ఇంటికి బైక్‌మీద బయలుదేరాడు. ఇంటినుంచి బయలు దేరి 5నిమిషాలు కాకా ముందే, ముత్తంగిలోని జాతీయ రహదారిపై ఉన్న చర్చి వద్ద, రోడ్డు మీదికి ఎక్కుతున్న లారీని బలంగా ఢీ కొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిబబ్లూ(5) పటాన్ చెరులోని ప్రాంతీయ ప్రభుత్వ దవాఖానకు తీసుకవెళ్లే సరికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో రమేశ్ చంద్రదాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని గాంధీ దవాఖానకు తరలించగా, రమేశ్‌చంద్రదాస్ చికిత్స పొందుతూ ఆదివారం సాయం త్రం మరణించాడు. కాగా ప్రమాదంలో గాయపడిన రమేష్‌చంద్రదాస్ భార్య సబితదాస్ ప్రస్తుతం అదే దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పటాన్‌చెరు పోలీసులు, మృత దేహాలను పటాన్‌చెరులోని ఏరియా దవాఖానలోని మార్చురీకి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...