జోరుగా మిషన్ భగీరథ పనులు


Sat,September 8, 2018 11:36 PM

కోహీర్ : ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మండలంలోని ఆయా గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రూ. 19.74కోట్లను మంజూ రు చేసింది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఇం టింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు వాటర్ గ్రిడ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మండలంలోని 24గ్రామ పంచాయతీలకు గానూ 34ట్యాంకులను నిర్మించాలని ప్రణాళికలను తయారు చేశారు. ఇప్పటికే కొన్ని ట్యాంకులను నిర్మించారు. మిగతా వాటి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూర్ (డీ), కొత్తూర్(కే), ఖానాపూర్, పీచెర్యాగడి తండా, సిద్దాపూర్, కవేలి, మనియార్‌పల్లి, లాల్‌సింగ్‌తండా, పోతిరెడ్డిపల్లి గ్రామంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరాయి. ఆయా గ్రామాల్లో కొత్త పైపులైన్లను అమర్చారు.

ప్రస్తుతం వెంకటాపూర్, పైడిగుమ్మల్, పీచెర్యాగడిలో పనులు కొనసాగుతున్నారు. కొత్త పైపులను వేసేందుకు గుంతలు తవ్వుతున్నారు. మండలంలో మొత్తానికి తాగునీటిని సరఫరా చేసేందుకు 12,25లక్షల మీటర్ల దూరం పైపులను బిగించాల్సి ఉంది. గత నెల 30వ తేదీన మంత్రి హరీశ్‌రావు కోహీర్‌లో పర్యటించి 15రోజుల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తామని హామీనిచ్చారు. దీంతో సంబంధిత అధికారులు పనుల్లో మరింత వేగాన్ని పెంచారు. కొత్త పైపులను ఏర్పాటు కాలేని పరిస్థితుల్లో గతంలో ఉన్న పైపుల ద్వారానే సింగూర్ జలాలను సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కోహీర్ పట్టణంలోని ట్యాంకులను శుభ్రం చేయించి ట్రయల్ రన్ నిర్వహించారు. నీటికి స్వచ్ఛ త లేకపోవడంతో ప్రస్తుతానికి ఎవరూ తాగొద్దని మైకు ద్వారా ప్రకటించారు. పైపుల్లోని మడ్డి తొలిగిన తర్వాతనే తాగాలని సూచిస్తున్నారు.

కవేలి ట్యాంకు ద్వారా సరఫరా..
కవేలి గ్రామ శివారులో నిర్మించిన ట్యాంకు ద్వారా సింగూర్‌లోని మంజీరా నీటితో నింపుతున్నారు. అక్కడి నుంచి ఆయా గ్రామాల్లో నిర్మించిన 34ట్యాంకుల్లోకి నీటిని సరఫరా చేస్తున్నారు. కొత్త పైపులు కావడంతో నీటితో పాటు అందులోని మట్టి, చెత్త కొట్టుకు వస్తున్నది. దీంతో రెండు, మూడు రోజులు ఎవరూ కూడా నీటిని తాగొద్దని సూచిస్తున్నారు. సంబంధిత అధికారిని వివరణ కోరగా మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...