మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి


Sat,September 8, 2018 11:35 PM

వట్‌పల్లి: ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని వట్‌పల్లి ఎస్‌ఐ మోహన్‌రెడ్డి సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం హరితహారంలో భాగంగా వట్‌పల్లి వెంకట్‌ఖాజా ఆశ్రమంలో సిబ్బందితో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంతో వాతవరణంలో వాయు కాలుష్యం తగ్గుతుందన్నారు. అడవులు విస్తీర్ణం పెరిగి సమయానికి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని దీన్ని గమనించి రైతులు చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు తమ సిబ్బందితో కలిసి అన్ని గ్రామాల్లో హరితహారం చేపట్టారని వివరించారు. రైతులు పొలంగట్లపై, ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ అశోక్‌కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ సర్పంచ్ సంగారెడ్డి, నాయకులు మధు, ధన్‌వేందర్‌రావు, గురుచరణం పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...