డ్రంకెన్ డ్రైవ్ కేసులో 7గురికి రూ. 14 వేల జరిమానా


Sat,September 8, 2018 11:34 PM

వట్‌పల్లి: మద్యంసేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 7గురు వ్యక్తులకు రూ. 14 వేల జరిమానా విధించినట్లు వట్‌పల్లి ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. వాహనాల తనిఖీలో భాగంగా తమ సిబ్బందితో చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించగా వివిధ గ్రామాలకు చెందిన 7 గురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపగా పట్టుకున్నామని చెప్పారు. వీరిని శనివారం జోగిపేట మున్సిఫ్‌కోర్టులో హాజరు పర్చగా జడ్జి స్వాతిరెడ్డి ఒక్కొక్కరికీ రూ. 2 వేల చొప్పున మొత్తం రూ.14 వేల జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేదిలేదన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...