విద్యార్థులు జాతీయ భావాన్ని కలిగి ఉండాలి


Sat,September 8, 2018 11:34 PM

పుల్కల్: విద్యార్థులు జాతీయ భావం కలిగి ఉండాలని ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి జే నిరంజన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో ఏబీవీపీ రాష్ట్ర శాఖ ప్రబోధన్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రెండు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1949లో ప్రారంభమైన ఎబీవీపీ అంచలంచలుగా ఎదిగి 35 లక్షల విద్యార్థుల సభ్యత్వం కలిగిఉందన్నారు. దేశంలో 18 ఏండ్లకే యువతకు ఓటు హక్కు కల్పించాలని ఏబీవీపీ ఉద్యమం చేసి సాధించిందన్నారు. బంగ్లాదేశ్ చొరబాటు దారులను గుర్తించి దేశంలోకి రాకుండా కంచె వేయించిన ఘనత ఏబీవీపీకే దక్కిందన్నారు. తీవ్రవాదులు విసిరిన సవాలును స్వీకరించి జమ్మూకశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో 10 వేల మంది కార్యకర్తలతో జాతీయ జెండాను ఏబీవీపీ ఎగురవేసిందని తెలిపారు. విద్యార్థుల్లో నిరంతరం దేశభక్తిని నింపుతూ విద్యార్థి సమస్యలపై పోరాడి పరిష్కరించిందని తెలిపారు. జేఎన్‌టీయూ బయోటెక్నాలజీ హెచ్‌వోడీ ఉమ మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ భావాన్ని నింపుతూ టెక్నాలజీలో ముందుండాలని సూచించింది. సంపదలో పడి పాశ్చాత్య దేశాలకు వెళ్లి మాతృ భూమిని మరచిపోకూడదని తెలిపారు. అంతకు ముందు ప్రబోధన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర టెక్నికల్ సెల్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, కో కన్వీనర్ రామకృష్ణ, మెదక్ విభాగ్ సంఘటన కార్యదర్శి విష్ణు, నాయకులు స్వామి, సంగమేశ్,అశోక్ పాల్గోన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...