ఆలయాల్లో శ్రావణ మాసోత్సవాలు


Sat,September 8, 2018 11:33 PM

కోహీర్ : మండలంలోని కవేలి మహాలింగ సంగమేశ్వరాల యం, బడంపేట రాచన్నస్వామి దేవాలయలలో శ్రావణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో సంగమేశ్వరాలయంతో పాటు బడంపేట రాచన్నస్వామి ఆలయంలోని శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, మహామంగళహారతి, తదితర పూజలు చేసి లక్ష బిల్వార్చన చేపట్టారు. అనంతరం భజనకీర్తనలు చేశారు. ఉత్సవాల్లో ఈవో శివరుద్రప్ప, జగదీశ్వర్‌స్వామి, శివానంద్ భక్తులు పాల్గొన్నారు.
గుబ్బడి సంగమేశ్వరాలయంలో అభిషేకం
ఝరాసంగం : మండల పరిధిలోని కుప్పానగర్ గుబ్బడి సంగమేశ్వర దేవాలయంలో శనివారం గర్భ గుడిలోని శివలింగానికి భక్తులు అభిషేకం చేశారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతిరోజు దంపతులతో 41రోజుల పాటు అభిషేకాలు, అర్చనలు చేస్తారు. వరుణ దేవుడు వర్షాలు సమృద్ధిగా కురిపించి పాడిపంట లు బాగా పండాలని దేవుడిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు బొగసిద్దప్ప, యాదగిరి, పండరిస్వామి, సంగయ్యస్వామి, ఆలయ అర్చకులు నాగేంద్రయ్యస్వామి, సంగయ్యస్వామి, భక్తులు పాల్గొన్నారు.
నేడు సప్తాహా భజన ముగింపు
మండలంలోని కుప్పానగర్ గ్రామ శివారు మల్లన్నగుట్ట ఆశ్రమంలో భక్తులు శ్రావణ మాసం సప్తాహా భజన కొనసాగుతున్నది. ఆదివారం ముగింపు ఉంటుందని ఆశ్రమ పీఠాధిపతి బసవలింగ అవధూతగిరి మల్లయ్యగిరిస్వామి తెలిపారు. కర్ణాకటలోని బొంగూర్, కంచి చించోలి, కుప్పానగర్, పీపడ్‌పల్లి, సంగం(కె), నర్సాపూర్, ఎల్గోయి, మందాపూర్ హనుమాన్ భజన మండలి సభ్యులు విచ్చేసి సప్తాహా భజనలో శివనామ స్మరణ చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదలు అందజేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...