ఆదరించండి అండగా ఉంటా..


Fri,September 7, 2018 11:54 PM

అందోల్, నమస్తేతెలంగాణ: అందోల్ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించారు. గురువారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ క్రాంతికి టికెట్ కేటాయించడంతో ఆయన శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించారు. మునిపల్లి, రాయికోడ్, వట్‌పల్లి, అల్లాదుర్గం, అందోల్, పుల్కల్ మండలాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. అందోల్ నుంచి పోటీచేసే అభ్యర్థులు ఎవరైనా ముందుగా అంతారంలో ప్రసిద్ధిగాంచిన విఠలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. క్రాంతికిరణ్ సైతం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా సంగారెడ్డి సమీపంలోని గణేశ్ గడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో మునిపల్లి మండలంలోని అంతారం విఠలేశ్వర ఆలయం,రాయికోడ్‌లోని వీరభద్రేశ్వరాలయం, వట్‌పల్లి వెంకట్‌ఖ్వాజా దర్గా, అల్లాదుర్గం రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. డాకూర్‌లో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఇంట్లో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. దశాబ్దాల తర్వాత టీఆర్‌ఎస్ అధినేత స్థానికుడికి టికెట్ కేటాయించడంతో అన్ని గ్రామాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందగా తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ఖమ్రొద్దీన్, ఏసయ్య, నాగభూషణం, జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి పాల్గొన్నారు.

అంతారంలోని విఠలేశ్వర పాండురంగ దేవస్థానంలో ప్రత్యేక పూజలు
మునిపల్లి: ఆదరించండి అండగా ఉంటా.. ఆపదలో తోడుంటా.. ఎల్లప్పుడూ ప్రజలకు నీడలా వెన్నంటే ఉంటానాని టీఆర్‌ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంతారంలోని విఠలేశ్వర పాండురంగ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలన ప్రజలు మెచ్చిన పాలన అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందంటే అది సీఎం కేసీఆర్ వల్లే అని అన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.

బైక్ ర్యాలీ..
టీఆర్‌ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ మునిపల్లికి రావడంతో మునిపల్లి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కన్పించింది. మునిపల్లి మండలంలో మునుపెన్నెడూ లేని విధంగా యువకులు కంకోల్ టోల్‌గేట్ నుంచి అంతారం వరకు సుమారు 500 వందల బైకులతో ర్యాలీ నిర్వహించారు. కంకోల్, మేళసంగెం,అ ంతారం గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంతారం దేవస్థానంలో స్థానిక ఎంపీటీసీ నాట్కరి రచమ్మను పూలమాల, శాలువా వేసి ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో బుసారెడ్డిపల్లి టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గడీల సంగమేశ్వర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు ఆనంద్, ముదిరాజ్ నర్సింహులు, గరిబొద్దీన్, భాస్కర్, రవి, శ్రీశైలంస్వామి, వెంకటేశం, మొగులయ్య, మల్లేశం, ఈశ్వర్, మహేశ్‌గౌడ్, పడకంటి హఫీజ్, నారాయణ, చంద్రయ్య, చెన్నవిరయ్యస్వామి, ఖదీర్ పాల్గొన్నారు.

అందోల్‌నుసీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలి
రాయికోడ్: అందోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని అందోల్ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రాయికోడ్‌లోని వీరభద్రేశ్వరస్వామి, పాండురంగ ఆలయాలలో పూజలు నిర్వహించారు. అనంతరం డా.బిఆర్. అంబేద్కర్, బోంగోండేశ్వర విగ్రహాలకు పూల మాలలు వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో అందోల్, రాయికోడ్, వట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు నాగభుషణం, ఏసయ్య, కమ్రొద్దీన్, నియోజకవర్గ నాయకులు జైపాల్‌రెడ్డి, భిక్షపతి, బస్వరాజుపాటిల్, ప్రభాకర్‌రెడ్డి, శివకుమార్, సాయికుమార్, బాలకృష్ణ, తుకారాం కురుమ, మండల నాయకులు బస్వరాజు, సతీశ్, పండరి ఉన్నారు.

వట్‌పల్లి దర్గాలో పూజలు, కార్యకర్తలతో సమావేశం
వట్‌పల్లి: అందోల్‌లో జరుగబోయే ఎన్నికలు అందోల్ ఆత్మగౌరవానికి, వలసవాదుల అహంకరానికి మధ్య పోటీ అని అందోల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాతికిరణ్ అన్నారు. శుక్రవారం వట్‌పల్లిలోని ప్రఖ్యాత వెంకట్‌ఖాజా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి దర్గా నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అంతకు ముందు పార్టీ శ్రేణులు భారీ బైక్‌ర్యాలీతో టపాకులు కాల్చుతూ క్రాంతికిరణ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని అంబేద్కర్, తెలంగాణతల్లి, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ఖమ్రొద్దీన్, డీబీ నాగభూషణం, వైస్ ఎంపీపీ భిక్షపతి, మాజీ ఎంపీపీలు కాశీనాథ్, విఠల్, చెంద్రయ్య, కో-ఆప్షన్ సభ్యుడు కుత్బుద్దీన్, నాయకులు రాహులు కిరణ్, పైతర సాయికుమార్ పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...