గీతం విశ్వవిద్యాలయంలో విజేతల దినోత్సవం


Wed,March 28, 2018 03:57 AM

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : గీతం విశ్వవిద్యాలయంలో మంగళవారం విజేతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్‌లు సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నూకల నరేందర్‌రెడ్డి పాల్గొని విద్యార్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధ్దిపై విద్యార్థులు దృష్టి సారించి ఉద్యోగం కోరేవారిగా కాకుండా ఇచ్చే వారిగా ఎదుగాలని సూచించారు. గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగార్థులుగా కంటే పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులు ఎదుగాలని గీతం విశ్వవిద్యాలయం అభిలాషిస్తున్నట్లు చెప్పారు. గీతం విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయనే తమ నిబద్ధతను ప్రాంగణ నియామకాలలో ఎంపికైన వారి సంఖ్యే ప్రతిభింభిస్తోందన్నారు. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన విద్యార్థులు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ విభాగంతో పాటు అధ్యాపకుల అలుపెరుగని శ్రమ, సమష్టి కృషివల్లనే ఈ ఉత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని అన్నారు.

82 శాతం మంది విద్యార్థులను
ఎంపిక చేసిన 100 కంపెనీలు...
2017-2018 విద్యా సంవత్సరంలో దాదాపు 100 దేశీయ, బహుళ జాతీ కంపెనీలు హైదరాబాద్ గీతమ్ ప్రాంగణ నియామకాలు నిర్వహించి 82 శాతం మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ విద్యార్థులను ఎంపి క చేసినట్లు గీతం వర్గాలు ప్రకటించాయి. దాదాపు 125 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపాయి. వీఎంవేర్ రూ.11 లక్షల గరిష్ఠ వార్షిక వేతనంతో గీతం విద్యార్థులను ఎంపిక చేయగా, కామ్‌వాల్ట్ రూ.10 లక్షల, బైజూస్ రూ.9.5లక్షలు, టెరాడేటా రూ.7.5 లక్షలు, కార్వీ రూ.7.42 లక్షలు, జోహో కార్పొరేషన్ రూ.6.5 లక్షల వార్షిక వేతనానికి విద్యార్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఐబీఎం 70 మంది గీతం హైదరాబాద్ వి ద్యార్థులను ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేయగా, అమెజాన్ 79 మందిని, జెన్‌పాక్ట్ 50 మం దిని, ఎన్‌టీటీ డేటా 47 మందిని, వాల్యూ మొ మెం టం 2 మందిని, వర్చూషా 23 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు గీతం అధికారులు తెలిపారు. కార్యక్రమం లో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూ ల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ సంజ య్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెర్ కే.అక్కలక్ష్మి, వివిధ విభాగాధిపతులు, వివిధ కంపెనీలకు ఎం పికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...