‘పునరాకృతి’తో ప్రోత్సాహం


Sun,December 15, 2019 01:13 AM

- చిత్రలేఖనంలో ఆసక్తి కలిగిన విద్యార్థినులకు అద్భుత వేదిక
-జాతీయ,అంతర్జాతీయ స్థాయి చిత్రకళాకారుల పాఠాలు
-ఉత్సాహంగా మహిళా దక్షత సమితి పెయింటింగ్ వర్క్‌షాప్
చందానగర్(నమస్తే తెలంగాణ): నిరుపేద బాలికలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మహిళా దక్షత సమితి వారిలోని సృజనాత్మక శక్తిని సైతం వెలికి తీసే పనిలో పడింది. సమితి పరిధిలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, ఒకేషనల్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న యువతుల్లో చిత్రలేఖనంపై ఆసక్తి కలవారికి ప్రత్యేక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. పునరాకృతి పేరిట గతేడాది ప్రారంభమైన ఈ పెయింటింగ్ వర్క్ షాప్ ఈ ఏడాది రెండో సారి కొనసాగుతుంది. శుక్రవారం ప్రారంభమైన ఈ వర్క్‌షాప్ మంగళవారంతో ముగి యనుంది. చిత్రలేఖనంపై ఆసక్తి కలిగిన విద్యార్థినులకు వివిధ పెయింటింగ్ అంశాల్లో మెళ కువలు నేర్పిస్తున్నారు. విద్యార్థినిల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని చిత్రాల రూపంలో ఆవి ష్కరించేందుకు అద్భుతమైన అవకాశాలను కల్పించారు. చార్‌కోల్, యాక్రిలిక్, ఆయిల్, మైక్రోలిక్ పెన్, ఫిగరేటివ్, మైథలాజికల్, యాబ్‌స్ట్రాక్ట్, ల్యాండ్ స్కేప్, నేచర్, రూరల్ ఇలా అనేక అంశాలతో కూడిన పేయింటింగ్‌లలో విద్యార్థినిలకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. తమకు నచ్చిన అంశాలతో చిత్రాలను వేస్తూ విద్యార్థినిలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. తమకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు మహిళ దక్షత సమితికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
18 మంది ప్రముఖ చిత్ర కళాకారుల సూచనలు...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రకళాకారులు యాగ్నస్ డీ కృజ్ రాజేష్, అహోబిలం ప్రభాకర్, వై.అన్నపూర్ణ, బాలభక్త రాజు, చందనాఖాన్, చిన్ని శ్రీపతి, దేబబ్రత బిశ్వాస్, జయశ్రీ బహేతి, జీవన్ గోసిక, మల్లేషం గుర్రం, మధు కురవ, సత్య గన్నోజి, శ్రీనివాస్‌రెడ్డి.బి, శ్రవన్‌కుమార్.జీ, శ్రీకాంత్‌బాబు ఆడెపు, టైలర్ శ్రీనివాస్, విజయ్ బెల్దే, విజయ్‌దోరేలు పునరాకృతి-2 లో పాల్గొని మహిళా దక్షత సమితి విద్యార్థిను లకు వివిధ పెయింటింగ్ అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...