ప్లాట్లలోకి రానివ్వడంలేదనే.. దహనం


Sun,December 15, 2019 01:12 AM

-వివాదాస్పద ప్లాట్లకు కాపాలాగా ఉన్న వాచ్‌మన్‌లపై కోపం...
-ప్లాట్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారనే.. వాచ్‌మన్‌పై పెట్రోల్ పోసి నిప్పు
-చికిత్స పొందుతూ మృతి
-నలుగురు నిందితులు అరెస్ట్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బోయిన్‌పల్లిలో వాచ్‌మన్‌పై పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సం బంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోయినపల్లిలోని శివ ఎన్‌క్లేవ్‌లో బంజారాహిల్స్‌కు చెంది న ప్రకాశ్‌డ్డికి సంబంధించిన వివాదాస్పదమైన ప్లాట్లు సర్వే నంబర్ 91/పార్టులోని 103 నుంచి 106, 111 నుంచి 114లకు వాచ్‌మన్‌గా సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్, లక్ష్మి దంపతులతో పాటు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన శరణప్ప కూడా పనిచేస్తున్నాడు. ఇవే ప్లాట్ల విషయంలో ప్రకాశ్‌రెడ్డికి, బోయినపల్లికి చెందిన తూముకుంట మాధవడ్డి, సామల మాధవడ్డి, జక్కుల సురేందర్‌డ్డిలకు మధ్య వివాదం కొనసాగుతున్నది. ఈ నెల 5న ఇద్దరు మాధవడ్డిలు, సురేందర్‌డ్డి వివాదాస్పదమైన స్థలంలో గోడను కూల్చేందుకు యత్నించగా.. వాచ్‌మన్ లు అడ్డుకున్నారు. దీంతో వారిపై కోపం పెంచుకున్నారు.

మద్యం తాగి.. పెట్రోల్ కొని..
ఈ నెల 6న రాత్రి ఘట్‌కేసర్ మండలం, అవుషాపూర్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌కు తూముకుంట మాధవడ్డి, సామల మాధవడ్డి, జక్కుల సురేందర్‌డ్డి.. డ్రైవర్ నగేష్‌సింగ్‌తో కలిసి హాజరయ్యారు. అక్కడి పూట్‌గా మద్యం సేవించి.. అదే రోజు రాత్రి అవుషాపూర్‌లో లీటర్ పెట్రోల్ కొన్నారు. అక్కడి నుంచి ఫర్చూనర్ (టీఎస్07బీబీటీఆర్-0716)లో బోయిన్‌పల్లిలోని శివ ఎన్‌క్లేవ్ వద్దకు రాత్రి 1.40 నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు. తూముకుంట మాధవడ్డి వాచ్‌మన్ శరణప్పపై పెట్రో ల్ పోసి నిప్పంటిం చాడు. గమనించిన వాచ్‌మన్‌లు శ్రీనివాస్, లక్ష్మి దంపతులు గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొం దుతూ శుక్రవారం మృతి చెందాడు. శరణప్పను హత్య చేసిన ఇద్దరు మాధవడ్డిలు, సురేందర్‌డ్డి, వారి డ్రైవర్ నేపాల్‌కు చెందిన నగేష్‌సింగ్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ అంజ య్య బృందాలు శనివారం వారిని అరెస్ట్ చేశారు. సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ కలమేశ్వర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఏసీపీ నరేష్‌డ్డి, ఇన్‌స్పెక్టర్ అంజయ్య, టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వర్‌రావు, ఎసై్సలు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...