రూ. 3 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన


Sat,December 14, 2019 03:41 AM

మేడిపల్లి : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకువెళ్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో శుక్రవారం సమారు రూ.3 కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు. మేడిపల్లిలో సుమారెసిడెన్సీ, ఎస్‌వీ కాలనీ, విష్ణుపరికాలనీ, భవానీ నగర్‌కాలనీ, చెన్నారెడ్డి ఎన్‌ఏ్లవ్‌లో సీసీ రోడ్లు, మారుతీనగర్‌లో పార్కు అభివృద్ధి పనులకు మంత్రి స్థానిక నాయకలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు విస్తరిస్తున్న పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో నూతన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీటితో ఎదుర్కొంటున్న సమస్యను తీర్చి మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా నగరపాలకలోని ప్రాంతాల వారికి తాగునీటిని అందుబాటులోకి తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిలా పరిషత్ల్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బుచ్చియాదవ్‌, జిల్లా నాయకలు దర్గదయాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకలు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ నగరపాలకలోని చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు బండి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఏసీపీ నర్సింహరెడ్డితో కలిసి ప్రారంభించారు. జం ట కార్పొరేషన్లలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్ల కోసం ముందుకు వచ్చి విరాళాలు అందించిన టీఆర్‌ఎస్‌ నాయకులు జక్క వెంకట్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిలతో పాటు పలువురిని అభినందించారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...