సోలార్‌ విద్యుత్‌ వాడకందారులకు ప్రభుత్వం చేయూత


Sat,December 14, 2019 03:19 AM

బండ్లగూడ: సోలార్‌ విద్యుత్‌ వాడకందారులకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తుందని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థలో ఆయన పూర్తి స్థాయి లో పునరుత్పాదక శక్తితో నడిచే 300కిలోవాట్స్‌ సామ ర్థ్యం గల రూఫ్‌టాప్‌ సోలార్‌ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం లో సోలార్‌ వాడకాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. సోలార్‌ పద్ధతిని ఉపయోగించే వారికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందన్నారు. భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో టీఎస్‌ఐఆరీ పరిపాలన అధికారి పౌసుమిబసు ఐఏఎస్‌ మాట్లాడుతూ గ్రామీణ మం త్రిత్వ శాఖ, నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో టీఎస్‌ రెడ్‌కో వారి సౌజన్యంతో దేశంలోనే మొదటిసారిగా 300కిలోవాట్స్‌ కరెంట్‌ను పూర్తిస్థాయిలో పునరుత్పాదక శక్తితో నడిచేందుకు వీలుగా తయారు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఎస్‌ఐఆర్డీ వార్షిక విద్యుత్‌ వినియోగం బిల్లు రూ.54లక్షలు కాగా ఈ సోలార్‌ ప్లాంట్‌ గ్రిడ్డును ఏర్పాటు చేయడం ద్వారా సంవత్సరానికి రూ.12లక్షల మూలధన వ్యయాన్ని తగ్గించవచ్చని తెలిపారు. వచ్చే మూడున్నర సంవత్సరాల్లో మూలధన పెట్టుబడిని తిరిగి పొందవచ్చని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టు సుమారు 25సంవత్సరాల వరకు సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ ఐఏఎస్‌, పంచయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందనరావు, టీఎస్‌ఐఆరీ పరిపాలన విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ బి.నరేంద్రనాధ్‌రావు, టీఎస్‌ రెడ్‌కో ఎండీ జానయ్య, జనరల్‌ మేనేజర్‌ ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అమరేందర్‌రెడ్డి, జి. జయపాలరెడ్డి, డి. ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles