‘పది’లో అత్యుత్తమ ఫలితాల సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేయండి


Thu,December 12, 2019 12:33 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షా ఫలితాలపై జిల్లా కలెక్టర్‌ మానిక్‌రాజ్‌ కన్నన్‌ బుధవారం జిల్లా విద్యాధికారి, ఉప విద్యాశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2019 మార్చి పదోతరగతి పరీక్షల్లో సాధించిన ఫలితాలపై నిర్మాణాత్మక పరిశీలన చేసి బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. గత సంవత్సరం ఫలితాల విశ్లేషణ ఆధారంగా ఈ సం వత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధించుటకు ప్రణాళికసిద్ధ్దం చేసుకోవాలని, ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులపై శ్రద్ధ వహించివారు పదోతరగతి ఆనంతరం కూడా విద్యను కొపసాగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి నుంచి మొదలుకొని జిల్లాలోని విద్యాశాఖాధికారులు అందరూ ప్రభుత్వ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణలో కొనసాగించి ప్రతి విద్యార్థి బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన రావాలని పేర్కొన్నారు.

అవసరమైన చోట్ల ఉపాధ్యాయుల సర్దుబాటు, వినిమమం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు పెంచడానికి కృషి చేయాలన్నారు. గణితం, సైన్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. వ్యవస్థను క్రమబద్ధీకరించడం, బలోపేతం చేయడం ద్వారా 2020 పదోతరగతి పరీక్షలందు జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...