విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: సబితారెడ్డి


Thu,December 12, 2019 12:33 AM

బండ్లగూడ: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి పాటుపడాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం షాదాన్‌ కళాశాల ఏర్పా టై 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా షాదాన్‌ కళాశాల ప్రొఫెసర్లు మర్యాదపూర్వకంగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డికి షాదాన్‌ కళాశాలలో విద్యా అభివృద్ధి జరుగుతున్న విధివిధానాలను వివరించారు. దీంతోపాటు వివిధ రంగాల్లో విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభ అభినందనీయంగా ఉందని మంత్రికి వివరించారు. అనంతరం సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని ఆ దశలో అభివృద్ధి పరిచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు రవీందర్‌, మథీ న్‌, డాక్టర్‌ ఇలియాస్‌, డాక్టర్‌ సైదులు, డాక్టర్‌ నసీబ్‌ఖాన్‌, ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...