తెలుగు గాయకులు సమర్థులు


Thu,December 12, 2019 12:31 AM

అహ్మద్‌నగర్‌: మాటలతో చేయలేని మ్యాజిక్‌ మ్యూజిక్‌తో చేయవచ్చని , ఆ కళను పుణికిపుచ్చుకున్న తెలుగు గాయకులు దక్షిణ భారత భాషలన్నింటిలో పాడగల సమర్థులుగా ఖ్యాతికెక్కారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ , సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎల్లారీశ్వరి , గాయకులు జి.ఆనంద్‌కు ఘంటసాల జయంతి సందర్భంగా ఘంటసాల పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారీశ్వరికి స్వరమనోహరి , జి.ఆనంద్‌కు స్వర సామ్రాట్‌ బిరుదులు ప్రదానం చేసి ఘంటసాల పురస్కారంతో సన్మానించారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ తెలుగు గాయకుల విశిష్టతను కొనాయాడారు.

1950వ దశకంలో సినీ నేపథ్య గాయనిగా రంగ ప్రవేశం చేసిన ఈ గాయకులు పాడిన పాటలు వినేందుకు తమ చిన్ననాట ఎడ్లబండ్లలో ప్రయాణం చేసి సినిమాలు చూసిన సందర్భాలున్నాయని గుర్తు చేసుకున్నారు. యువకళావాహిని అధ్యక్షుడు లయన్‌ వైకె నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ , శృతిలయ అధ్యక్షుడు డాక్టర్‌ బి.భీమ్‌రెడ్డి , వ్యవస్థాపక కార్యదర్శి ఆమని , లలిత సేవా సదనం చైర్మన్‌ లయన్‌ జి.హనుమంతరావు , సీనియర్‌ హైకోర్టు అడ్వకేట్‌ డాక్టర్‌ ఎంఏ రహీం , కార్యక్రమ నిర్వాహకులు ఈసీ శేఖర్‌ , కుసుమ భోగరాజు , కళ పత్రిక సంపాదకులు డాక్టర్‌ మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలియాబాద్‌ గ్రామ సర్పంచ్‌ , ఉప సర్పంచ్‌లైన జి.కుమార్‌ యాదవ్‌ , జి.ప్రభాకర్‌ రెడ్డిను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సన్మానించారు. అనంతరం ఘంటసాల స్వర వైభవం-సినీ సంగీత విభావరిలో ఎల్లారీశ్వరి తన స్వర మాధుర్యంతో అలరించారు. కార్యక్రమంలో గాయకులు కె.వెంకట్రావ్‌ , పి.సుభాశ్‌ , వీకే దుర్గు , ఆమనితో పాటు పురస్కార గ్రహీత ఆనంద్‌ ఘంటసాల పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...