నైపుణ్యం పెంచుకోండి


Thu,December 12, 2019 12:30 AM

కంటోన్మెంట్‌: ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకు మానవ వనరులను తీర్చిదిద్దాల్సిన అవసరముందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. స్కిల్‌ ఇండియా కార్యాచరణలో భాగంగా బుధవారం బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రికగ్నిషన్‌ ఆఫ్‌ ప్రయర్‌ లెర్నింగ్‌(ఆర్‌పీఎల్‌) తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మీడియా రంగంలో పనిచేసే వారు నైపుణ్యాలను వృద్ధ్ది చేసుకునేందుకు ఆర్‌పీఎల్‌ ప్లాట్‌ఫాంగా నిలుస్తున్నదన్నారు. మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ స్కిల్‌ కౌన్సిల్‌(ఎంఈఎస్‌సీ) దక్షిణ ప్రాంతీయ సలహాదారు ప్రతిభా పులిజాల మాట్లాడుతూ.. రికగ్నిషన్‌ ఆఫ్‌ ప్రయర్‌ లెర్నింగ్‌ ద్వారా వ్యక్తులు నేర్చుకునే నైపుణ్యాలను అంచనా వేయడంతో పాటు గుర్తింపును ఇవ్వవచ్చన్నారు.

అప్రకటిత రూపంలో స్వీకరించే నైపుణ్యాలు విద్యాబోధనకు సైతం ఉపయోగపడుతాయని, ఆర్‌పీఎల్‌ ఇలాంటి వారికి నైపుణ్య సర్టిఫికెట్లను అందజేస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌, టెలివిజన్‌, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్‌, యానిమేషన్స్‌, ప్రింట్‌ మీడియా వంటి రంగాల్లో ఆ సర్టిఫికెట్‌కు ప్రాధాన్యంగా తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నెల 18,19వ తేదీల్లో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సర్కిల్‌ సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, లయన్స్‌ క్లబ్‌ వద్ద ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...