హెచ్‌ఎండీఏలో 25 మంది ప్లానర్స్‌ నియామకాలకు కసరత్తు


Tue,December 10, 2019 12:17 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విస్తరిత ప్రాంతాల్లో అభివృద్ధికి అనుగుణంగా రోడ్ల ప్రతిపాదనలు, రవాణా సదుపాయాలను మరింత మెరుగుపర్చడంతోపాటు భూ వినియోగ కేటగిరీలను మార్చాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన, జోనల్‌ అభివృద్ధి ప్రణాళిక, ప్రాంతపు అభివృద్ధి ప్లాన్‌, రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికను రూపొందించేందుకు గానూ ప్రైవేట్‌ కన్సల్టెన్సీలకు, సంస్థలకు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు. ప్రైవేట్‌ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్టు) నివేదికను సదరు ఏజెన్సీలకు సూచించారు. ఇందులో భాగంగానే వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్లానర్స్‌ను దాదాపు 8 కేటగిరిల్లో 25 మందిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పలువురిని అధికారులు ఇంటర్వ్యూలు చేశారు. రాబోయే రెండు రోజులు(మంగళ, బుధ) ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తి చేసి ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలను భర్తీ చేయనున్నామని తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...