సికింద్రాబాద్‌ రీజియన్‌ ఓకే..హైదరాబాద్‌తో సమస్య


Mon,December 9, 2019 12:53 AM

సికింద్రాబాద్‌ రీజియన్‌లో బస్సుల ఆపరేషన్స్‌ వల్ల ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ హైదరాబాద్‌ రీజియన్‌కు సంబంధించి నష్టాలు వస్తున్నాయి. రూ. కిలోమీటరుకు రూ 27 రూపాయలు వస్తేనే నిర్వహణ సాధ్యమవనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ రీజియన్‌లోని చాలా రూట్లలో కిలోమీటరుకు కేవలం రూ.17 మాత్రమే రెవెన్యూ వస్తుండటంతో నష్టాలు వస్తున్న రూట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఇందు కోసం బస్‌చార్జీలతోపాటు ఆర్టీసీ బస్‌ ఆపరేషన్‌ టైమింగ్‌ల్లో మార్పులు తేనున్నారు. ఉదయం 5 గంటల నుంచి కాకుండా 6 గంటల నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్లపైకి తీసుకురానున్నారు. అదేవిధంగా రద్దీ వేళల్లో బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచడంతోపాటు, మధ్యాహ్నం సమయాల్లో రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేయనున్నారు. రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే చివరి పాయింట్‌ నుంచి ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభమై డిపోకు చేరుకుంటుంది. నష్టాలు వస్తున్న రూట్లను గుర్తించి ఆయా మార్గాల్లో సర్వీసులను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...