ఔటర్‌ అండర్‌పాస్‌లకు ‘ఎల్‌ఈడీ’ వెలుగులు


Mon,December 9, 2019 12:52 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఔటర్‌ అండర్‌పాస్‌ల వద్ద ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎండీఏ/హెచ్‌జీసీఎల్‌) విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా అండర్‌పాస్‌లు మారుతున్నాయని భావించిన అధికారులు పటిష్టమైన భద్రత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమైన ప్రాంతాల్లో సోలార్‌ ఆథారిత ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాటుకు అధికారులు ఆదివారం టెండర్లను ఆహ్వానించారు. పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్‌, కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్‌చెరు నుంచి గౌడవల్లి స్ట్రెచ్‌ల మధ్య అండర్‌పాస్‌లకు (వీయూపీ/పీయుపీ) సోలార్‌ ఆధారిత ఎల్‌ఈడీ పనులకు రూ.68.60 లక్షలు, మేడ్చల్‌ నుంచి పెద్ద అంబర్‌పేట స్ట్రెచ్‌ నందు అండర్‌పాస్‌లకు (వీయూపీ/పీయూపీ) పనులకు రూ.68.60లక్షలు, పటాన్‌చెరు నుంచి పెద్ద అంబర్‌పేట స్ట్రెచ్‌ అండర్‌పాస్‌లకు (వీయూపీ/పీయూపీ) రూ. 71.50 లక్షల అంచనాతో టెండర్లను పిలిచారు. అర్హత గల ఎజెన్సీలకు దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 17 మధ్యాహ్నం 3 గంటల గడువు విధించారు. ఈ నెలాఖరులోగా పనులు చేపట్టనున్నామని అధికారులు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...