జీవితంలో స్థిరపడలేదని.. యువతి ఆత్మహత్య


Mon,December 9, 2019 12:50 AM

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : జీవితంలో స్థిరపడాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లో నివాసం ఉండే యువతి అమల(25)నాలుగేండ్లుగా అమెరికాలో ఉండి ఇటీవల నగరానికి వచ్చింది. తన జీవితంలో ఏదీసరిగా లేదంటూ కొన్నిరోజులుగా కుటుంబసభ్యులతో చెబుతుండేది. శనివారం రాత్రి ఆరోగ్యం బాగలేదంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అర్ధరాత్రి అయినా బయటలకు రాకపోవడంతో తల్లిదండ్రులు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి గదిలో లభించిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...