అడ్డుగా ఉన్నాడనే హత్య..


Sat,December 7, 2019 12:57 AM

మన్సూరాబాద్ : గత నెల 26న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గుడిసెలో పడుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమైన కేసును పోలీసులు ఛేదిం చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటమే కాకుండా తరచూ మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తను భార్య, ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ కథనం ప్రకారం... సూర్యాపేట జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన చిర్రబోయిన రమేశ్ (30), స్వప్న (28) దంపతులు. వీరు బీఎన్‌రెడ్డినగర్, ఎస్‌కేడీనగర్‌లో గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. వీరి గుడిసె సమీపంలో ఉండే నల్గొండ జిల్లా, డిండి మండలం, ప్రతాప్‌నగర్‌కు చెందిన అరిదేశి వెంకటయ్య అలియాస్ వెంకటేశ్ (32)తో స్వప్నకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే రమేశ్ తరచూ మద్యం తాగి వచ్చి స్వప్నను వేధించేవాడు. దీంతో స్వప్న ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని పథకం పన్నింది.

ఈ పథకంలో భాగంగా స్వప్న గత నెల 23న పిల్లలతో కలిసి ఊరికి వెళ్లింది. గత నెల 25న రాత్రి రమేశ్ మద్యం తాగి గుడిసెలో పడుకోగా.. వెంకటేశ్ పెట్రోల్ పోసి నిప్పం టించాడు. స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. స్వప్న ప్రవర్తనపై పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఎస్‌కేడీనగర్‌లో ఉన్న వెంకటేశ్‌తో పాటు స్వప్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నారు. ఈ ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ జయరాం, సీఐ వెంకటయ్య, ఎస్సై వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...