సహజ ఉత్పత్తులతో ఆరోగ్య సంరక్షణ


Sat,December 7, 2019 12:57 AM

తార్నాక : ఆరోగ్యమైన సమాజం కోసం సహజ ఉత్పత్తులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ్ పిలుపునిచ్చారు. తార్నాకలోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్‌ఐఎన్)లో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం సహజ ఉత్పత్తులు-మాలిక్యులర్ టార్గెట్స్ నుంచి థెరపీ వరకు అనే అంశంపై సాగుతున్న అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా పౌష్టికాహారాలు కలిగిన ఆహారాన్ని తీసుకొనే సాంప్రదాయ ఆహారానికి పునాదులు వేసేదన్నారు.

కానీ రోజురోజుకు సాంప్రదాయ ఆహారాన్ని విస్మరించి పాశ్చాత్య ఆహారానికి అలవాటు పడి చిన్న వయస్సులో పెద్దవారిగా కన్పించడంతోపాటు, వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడిన తర్వాత వృద్ధుల కోసం సహజక ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఇండియా-చైనా దేశాల మధ్య పరస్పర సహకారంతో అనుసంధానంగా పరిశోధనలు కొనసాగించాలని కోరుతూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అనంతరం ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా.ఆర్.హేమలత మాట్లాడుతూ సహజ ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు 32 దేశాల నుంచి వచ్చిన 110 మంది శాస్త్రవేత్తలు హాజరయ్యారు. వివిధ పోస్టర్ ప్రదర్శనలను ప్రదర్శించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...