హై సెక్యూరిటీ ప్లేట్లతో ఇబ్బందులు


Fri,December 6, 2019 01:21 AM

-నిర్ణీత సమయంలోగా రావడంలేదన్న డీలర్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డీలర్లకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల బిగింపు ప్రక్రియను బదలాయించినప్పటికీ వినియోగదారులకు సరైన సేవలందడంలేదు. వాహన రిజిస్ట్రేషన్ల తర్వాత నంబరు ప్లేటు బిగించాలంటే ప్లేట్లు సరఫరా కావడం లేదని డీలర్లు రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత నెల 15వ తేదీ నుంచి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల బిగింపు ప్రక్రియను రవాణాశాఖ కార్యాలయాల నుంచి బదిలీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నామని వాపోయారు. గురువారం ఖైరతాబాద్‌ రవాణాశాఖ పరిధిలోని వాహన డీలర్లతో ఆర్‌టీవోలు దుర్గప్రసాద్‌, రాంచందర్‌ ఏఎంవీఐ వాసు సమావేశమయ్యారు. హై సెక్యూరిటీ ప్లేట్ల బిగింపులో ఎదురవుతున్న పలు సమస్యలు డీలర్లు అధికారుల దృష్టికి తెచ్చారు. బదలాయింపు జరిగిన సమయానికి ముందు రిజిస్టరైన వాహనదారులు తమ వద్దకు వస్తున్నారని, వీరికి నంబరు ప్లేట్లు తమ వద్ద లేవని, ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయం ఆవరణలో నంబర్‌ప్లేట్లు ఉన్నప్పటికీ నిర్వాహకులు తెరువడం లేదంటూ తమ వద్దకు వస్తుండటంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే ఈ విషయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. ఇన్‌వాయిస్‌ ప్రకారమే వాహనాలను అమ్మాలని, ఎక్స్‌షోరూం ధర వద్దని, అమ్మకాల విషయంలో రవాణాశాఖ ఉత్తర్వులు పాటించాలని ఆదేశించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...