నార్త్‌ నుంచి సౌత్‌ మొబిలిటీ కారిడార్‌


Fri,December 6, 2019 01:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :జూబ్లీ బస్‌స్టేషన్‌(జేబీఎస్‌) నుంచి ఫలక్‌నుమా వరకు లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ తదితర పర్యాటక ప్రాంతాలను కలుపుకుంటూ నార్త్‌-సౌత్‌ మొబిలిటీ కారిడార్‌ పేరుతో సరికొత్త కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కారిడార్‌ను అభివృద్ధి చేయడంతోపాటు అందులో ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బీఆర్‌టీఎస్‌, ట్రామ్‌-వే తదితర వాటిల్లో ఏది సాధ్యమైతే దాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం ఇండో-ఫ్రెంచ్‌ కన్సార్టియం ఆధ్వర్యంలో వివిధ సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులతో బుద్ధభవన్‌లో జరిపిన సమీక్ష సందర్భంగా వివరాలు వెల్లడించారు. భవిష్యత్‌ ప్రజా అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు నార్త్‌-సౌత్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మొబిలిటీ కారిడార్‌ను ఫ్రెంచ్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌తో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ మార్గంలోని రోడ్లు, ట్రాఫిక్‌ పరిస్థితి, ప్రత్యామ్నాయ అంశాలు తదితర వాటిని అధ్యయనం ద్వారా గుర్తించనున్నట్లు చెప్పారు.

పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, దీంతో ఆయా స్థలాలకు పర్యాటకులు మరింత సులభంగా వెళ్లే వీలు కలుగుతుందన్నారు. 2020 ఫిబ్రవరిలో సమగ్ర అధ్యయన నివేదిక సిద్ధమవుతుందని, అనంతరం దాన్ని ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. సమావేశం సందర్భంగా ఇది వరకే ఆయా సంస్థలు ప్రాథమికంగా అధ్యయనం చేసిన అంశాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను ప్రదర్శించాయి. సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, అధ్యయనం చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు విన్సెంట్‌ లిచ్చర్‌(స్వెజ్‌ కన్సల్టెన్సీ), హర్షిత(అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కార్పొరేషన్‌), బ్రూనో(బ్రూనో ఏజెన్సీ), ైక్లెమెన్స్‌ విడాల్‌, వాలెండినో(ట్రాన్స్‌ సామో) పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...