డబుల్ స్పీడ్..


Thu,December 5, 2019 04:07 AM

-శరవేగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం
-జిల్లాకు 6,777లు మంజూరు..
-2972 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి 2407కి పనులు ప్రారంభం
-పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కసరత్తు
-రూ.84కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం
-కందుకూరు 4 ఎకరాల భూదాన్ భూమిని కేటాయించేందుకు ఏర్పాట్లు
-టెండర్లకు స్పందన రాకపోతే ఒకే చోట, మండల కేంద్రాల్లో జీ ప్లస్ 3 నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు
-కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా ప్రణాళికలు
-డబుల్ కోసం 1.93 లక్షల దరఖాస్తులు

సొంతిల్లు ఉండాలన్న ప్రతి నిరుపేద కల త్వరలో సాకారం కానుం ది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం జోరు గా సాగుతున్నది. 2015-16, 2016-17వార్షిక సంవత్సరంలో జిల్లాలో 6,645 డబుల్ బెడ్రూంలు కేటాయించగా, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 1705, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో 4,940 ఇం డ్లు నిర్మించనున్నారు. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా గృహనిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే గతంలో నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే, ఆర్‌జీకేలలో చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేక ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో నీటి సౌకర్యం, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
- రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ

5-Coloumf
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : ఇండ్లులేని పేదలకు పక్కాగృహాలు నిర్మించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు త్వరలో ఊరట కలుగనుంది. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంపై ఇటీవల విద్యాశాఖమంత్రి సబితారెడ్డి జిల్లా గృహ నిర్మాణపనులపై సమీక్షా సమావేశం నిర్వహించి పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఆ దిశగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం చరిత్రలో నిలిచిపోనుంది. జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిరుపేదలకు పైసా భారం లేకుండా సొంతింటి కలను సాకారం చేస్తుంది ప్రభుత్వం. జిల్లాలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో 6,777డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా 2972 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ ముగియగా, 2407 పనులు ప్రారంభించారు. మిగుతావాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరిన్ని ప్రాంతాల్లో నివాసయోగ్యమైన స్థలాలను ఎంపిక చేసేందుకు అధికారులకు కసరత్తు చేస్తున్నారు.

246.88ఎకరాల్లో 6,645 ఇండ్ల నిర్మాణం...

ప్రభుత్వం రెండు పడకల గృహం పథకం ప్రణాళికలో భాగంగా 2015-16, 2016-17 వార్షిక సంవత్సరంలో జిల్లాలో 6,777డబుల్ బెడ్రూంలు కేటాయించారు. స్థానిక శాసనసభ్యులు, మంత్రుల కమిటీల ద్వారా కలెక్టర్ 6,645ఇండ్లను నిర్మించేందుకు మంజూరుచేశారు. ఈ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం భూమి 246.88ఎకరాలు సేకరించారు. 6,645ఇండ్ల మంజూరులో చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాలో 1705 ఇండ్లను జిల్లా పంచాయతీరాజ్‌కు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 4,940ఇండ్లను జిల్లా ఆర్‌అండ్‌బీశాఖకు అప్పగించారు. జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం నిర్మాణం జీ ప్లస్ త్రీ నిర్మాణ క్రమం సీప్లస్‌ఎస్‌ప్లస్ నైన్ నిర్మాణం క్రమంతో జీహెచ్‌ఎంసీ అధికారులు 2 బీహెచ్‌కే ఇండ్లు నిర్మిస్తున్నారు.

కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా ప్రణాళికలు

టెండర్లు నిర్వహించేటప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి, వారి చేతే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మంజూరైన డబుల్ బెడ్రూంలకు మరో రూ.84కోట్ల నిధులు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమవుతాయని, వాటి మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ఇండ్లులేని పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ గృహాలు అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు ఉనయోగపడేలా ఉండేలా చూడాలని హౌసింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇసుక కొరత ఏర్పడకుండా కందుకూరులో 4ఎకరాల భూదాన్ భూమిని కేటాయించనున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి, త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. టెండర్లకు స్పందన రాకపోతే ఒకేచోట, మండల కేంద్రాల్లో జీ ప్లస్ 3 నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. దీంతోపాటు గతంలో నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే, ఆర్‌జీకేలలో చాలా చోట్ల లబ్ధిదారులు ఉండడంలేదని, ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పనకు అధికారులు శ్రీకారం చుట్టారు. వాటిలో నీటిసౌకర్యం, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎవరికి కేటాయించని వాటిని వెంటనే స్థానిక లబ్ధిదారులకు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలోని యూనిట్ విలువ రూ.1.20లక్షలు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకంలోని యూనిట్ విలువ రూ.1.50లక్షల వాటాను రెండు పడుకల యూనిట్‌కు అనుసంధానంచేశారు.

1.93 లక్షల డబుల్ దరఖాస్తులు

జిల్లాలోని 27మండలాల నుంచి రెండు పడుకల ఇండ్ల మంజూరు కోసం ఇప్పటివరకు లక్ష 93వేల 128మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో వారి పేర్లను నమోదు చేసుకుని ఉన్నా రు. ఈనెల 6వరకు 1,89,433ఉండగా 22రోజుల్లో 3,695మంది దరఖాస్తులు చేసుకున్నారు.
5-Coloumf1

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...