అంధ విద్యార్థులకు మెట్రో జాయ్ రైడింగ్


Wed,December 4, 2019 02:51 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎల్ అండ్ టీ మెట్రో రైల్(హైదరాబాద్) లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం దేవ్‌నార్ స్కూల్ ఫర్ ది బ్లెండ్ విద్యార్థులతో అంతర్జాతీయ దివ్యాంగుల సంక్షేమ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి నాగోల్ నుంచి బేగంపేట్, అలాగే బేగంపేట్ నుంచి నాగోల్ వరకు జాయ్ రైడ్‌ను ఏర్పాటు చేశారు. స్ట్రీట్ లెవల్ నుంచి కాన్‌కోర్స్ వరకు మెట్రో రైలు ఎక్కడం, దిగడంతోపాటు టికెట్ కౌంటర్ నుంచి ప్లాట్‌ఫాం, రైలు వరకు చేరుకోవడం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అవసరమైన శిక్షణ, తప్పనిసరి అవసరాలకు అనుగుణంగా మెట్రో సిబ్బంది కూడా విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. స్కూలు విద్యార్థులు మాస్టర్ నమన్, మాస్టర్ హర్షవార్‌లకు మెట్రోలో ప్రయాణించిన అనుభవం ఉండడంతో వారు ఇతర విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. హైదరాబాద్ మెట్రోరైలును దివ్యాంగులకు పూర్తి అనుకూలంగా ఉండేలా రూపొందించడం గమనార్హం. దివ్యాంగులు తమ మార్గాన్ని సులభంగా గుర్తించేలా స్టేషన్లలో ప్రత్యేకమైన ఫ్లోరింగ్ ఉన్నది. వైద్య అత్యవసర స్థితి, సంసిద్ధతలో నైపుణ్యం కలిగి ఉండడంతోపాటుగా స్వతహాగా అంధురాలైన మెర్కురీ మెడికా ఇనిస్టిట్యూషనల్ సేల్స్ మేనేజర్ పాయల్ కపూర్ మెట్రో రైలులో బేగంపేట్ నుంచి నాగోల్ వరకు ప్రయాణించి దివ్యాంగుల కోసం కల్పించిన సదుపాయాలను ప్రశంసించారు. ఎల్ అండ్ టీ సీఈవో కేవీబీ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించి మెట్రోరైలులో దివ్యాంగుల సౌకర్యార్థం కల్పించిన సదుపాయాలను వారికి వివరించారు. మైట్రో రైలు ప్రాజెక్టును దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దినట్లు, అంతేకాకుండా వారి అవసరాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లను కూడా చేసినట్లు వివరించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...