‘ఎల్‌ఐసీ మెయిన్స్’ ఉచిత శిక్షణ


Wed,December 4, 2019 02:49 AM

కవాడిగూడ : ఎల్‌ఐసీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం జరిగిన ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఇన్సూన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సికింవూదాబాద్ డివిజన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి రాజేశ్‌సింగ్ తెలిపారు. కవాడిగూడలోని ఎల్‌ఐసీ సికింవూదాబాద్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు శిక్షణా తరగతులు దోమలగూడలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ప్రతి రోజు సాయవూంతం 5నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 040-23420701, 7842696186, 9440051053లో సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్షికమంలో హైదరాబాద్ డివిజన్ నాయకులు తిరుపతయ్య, ఆదిశ్‌డ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...