జర్నలిస్టులందరికీ ఇండ్లు, స్థలాలు కేటాయించాలి


Tue,December 3, 2019 02:22 AM

కాప్రా: తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రథమ మహాసభ సోమవారం ఏఎస్‌రావునగర్‌లోని ఏఎస్‌రావు సెంచినరీ భవన్‌లో జరిగింది. టీడబ్ల్యూజేఎఫ్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మెరుగు చంద్రమోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, ఉపాధ్య క్షుడు ఆనందం హాజరయ్యారు. జీవో 239ను సవరించి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని మహాసభ తీర్మానించింది. జర్నలిస్టులకు ఇండ్లు, స్థలాలు కేటాయించాలని,మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వక్తలు కోరారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు టీడబ్ల్యూజేఎఫ్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తన్నీరు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా యావపురం రవి, కోశాధికారిగా కల్యాణచక్రవర్తి, ఉపాధ్యక్షులుగా గోవర్ధన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శోభన్‌బాబు, ఎల్లంపల్లి నరసింహులు, సంయుక్త కార్యదర్శులుగా సంజీవరెడ్డి, అనిల్‌రెడ్డి, రాజమణి, కార్యవర్గ సభ్యులుగా గోపి, శివకుమార్‌, పరమేశ్వర్‌రెడ్డి, రవీందరర్‌గౌడ్‌, సత్యనారాయణ సాగర్‌,యాదగిరి, మంజులరెడ్డిని, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా బెలిదే అశోక్‌గుప్తాను ఎన్నుకున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...