ఎస్సీలకు మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు


Tue,December 3, 2019 02:21 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడే మనిషోయ్‌.. అన్నాడు గురజాడ. అన్నట్లుగా మన వారు తిండికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీనికి తగినట్లుగానే ఆహారం ఎక్కడపడితే అక్కడ హోటళ్లు, టిఫిన్‌సెంటర్లు వెలుస్తూ..పుష్కలంగా దొరుకుతుంది. నలుగురి కడుపునింపి నాలుగురాళ్లు వెనకేసుకునే వారు భోజన ప్రియులు ఉన్నచోటే ఉంటూ క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రొత్సాహకాలిచ్చేందుకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ముందుకొచ్చింది. స్వయం ఉపాధి పథకాల కింద మొబైల్‌ టిఫిన్‌ సెంటర్ల ఏర్పాటుకు సబ్సిడీ రుణాన్నిచ్చి సాయమందించనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికచేసి ఎస్సీలకు మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లను మంజూరుచేయబోతున్నారు. ప్రస్తుతానికి 20 వ్యక్తిగతయూనిట్లను జిల్లాకు కేటాయించారు. వీటి పనితీరును బాగుండి.. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఆదాయం మెండుగా ఉంటే మరికొన్ని యూనిట్లను మంజూరుచేసేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ యూనిట్లు విజయవంతంగా నడిస్తే.. లబ్ధ్దిదారులకు మంచి ఆదాయం లభిస్తే దశల వారీగా ఈ ఇలాంటి యూనిట్లను రాష్ట్రమంతా నెలకొల్పేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. కొంత మొత్తాన్ని ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ ఇవ్వనుండగా, మరికొంత మొత్తాన్ని బ్యాంక్‌ రుణంగా సమకూర్చనున్నారు. ఇందు కోసం జిల్లా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారుల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...